బీమాపై కల్లుగీత కార్మికుల సంబురం
కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
- కుటుంబాలకు భరోసా దొరికిందన్న సంతోషం
- ఇన్నేళ్లూ ఎక్స్‌గ్రేషియా కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి
- ఇప్పుడు నేరుగా బాధిత కుటుంబానికి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ
- బీఆర్ఎస్ సర్కారు నిర్ణయంపై సర్వత్రా హర్షం
- సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామంటున్న కల్లుగీత కార్మికులు
కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రమాదవశాత్తు కల్లు గీత కార్మికుడు చనిపోతే అతడి కుటుంబానికి రూ.5లక్షల బీమా వర్తించేలా విధివిధానాలను ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కల్లు గీత కార్మికుడెవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.లక్ష మాత్రమే పరిహారం వచ్చేది. శాశ్వత వైకల్యం కలిగితే రూ.50వేలు మాత్రమే పరిహారం అందేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రమాదవశాత్తు కల్లు గీత కార్మికుడు చనిపోయినా, శాశ్వత వైకల్యం కలిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2లక్షల బీమా అందించింది. మరో దఫాలో ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షల వరకు పెంచినా వైకల్యం తీవ్రతను బట్టి పరిహారం బాధిత కుటుంబానికి అందేది. ప్రమాదవశాత్తు గీత కార్మికుడు చనిపోతే తమకు రావాల్సిన రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం దుఃఖంలో ఉన్న కుటుంబం పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. ఎఫ్ఐఆర్ కాపీ, సాక్షులు, డెత్ సర్టిఫికెట్, ఇతర ధ్రువీకరణ పత్రాలను అందజేసి కార్యాలయాల చుట్టూ తిరిగితే గానీ పరిహారం రావడం లేదు. ఆ పరిహారాన్ని సైతం చెక్కు రూపంలో ఇస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం కలిగినా సంబంధిత వ్యక్తి కుటుంబం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. కల్లు గీత కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే, రైతుబీమా తరహా ఆ కుటుంబానికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో బీమా డబ్బు జమ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో గౌడన్నలు, వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 3
ఆపత్కాలంలో భరోసా
రాయపర్తి : గీత వృత్తిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న గౌడన్నల బతుకులకు ఆపద కాలంలో భరోసా కలిగించిన మహానుభావుడు సీఎం కేసీఆర్ సారు. కల్లు గీసే క్రమంలో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ గీత కార్మికుడికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.5లక్షల గీత కార్మిక ప్రమాద బీమాను ప్రకటించడం గొప్ప నిర్ణయం. గతంలో తాడిచెట్లపై నుంచి కార్మికులు పడి చనిపోతే ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందక చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రకటించిన బీమా పథకంతో రాష్ట్రంలోని గౌడన్నల కుటుంబాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పబ్బతి పడుతున్నరు.
– తాళ్లపల్లి రాజుగౌడ్, బురహాన్‌పల్లి, రాయపర్తి
గీత బీమా హర్షణీయం
రైతుబీమా తరహాలో సీఎం కేసీఆర్ గీత కార్మిక బీమా ప్రవేశపెట్టడం హర్షణీయం. ఎందుకంటే ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులు, శాశ్వత వైకల్యం కలిగిన వారు పరిహారం కోసం ఎట్ల దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెల్వక ఇంటి పెద్దలు చనిపోయిన రందిలోనే ఆ కుటుంబం ఉండేది. ఇప్పుడు రైతుబీమా లెక్క వారం పది రోజుల్లో ప్రమాదానికి గురైన కల్లుగీత కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాలో పడేలా చేయడం చాలా మంచి నిర్ణయం.
– నేరెళ్ల సునీల్‌గౌడ్, వెంకట్రావుపల్లి, టేకుమట్ల మండలం
బీమాతో ధైర్యం
వర్ధన్నపేట : నిత్యం చెట్లు ఎక్కి కల్లు తీస్తూ కుటుంబాలను పోషించుకునే మాకు రైతుబీమా తరహాలో బీమా కల్పించడం సంతోషంగా ఉంది. గతంలో అనేక మంది చెట్టుపై నుంచి ప్రాణా లు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం నుంచి పరిహారం మంజూరు కావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల తరహాలో గీత కార్మికులకు కూడా రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించడం మంచి విషయం. ప్రమాదవశాత్తు మాకు ఏ మైనా జరిగితే మా కుటుంబానికి దిక్కులేకుండా పోతది. కానీ మా కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బీమా ఇవ్వడం కా ర్మికులకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.
– సట్ల కుమారస్వామి, ఇల్లంద
బీఆర్ఎస్ సర్కారుకు ధన్యవాదాలు
వెంకటాపూర్ : గీత కార్మికుల కోసం బీమా సౌకర్యం తీసుకువచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మా గౌడ కులస్తుల తరఫున ధన్యవాదాలు. తాటిచెట్టు ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే చాలా ఇబ్బంది పడేది. ఇదివరకు ఎక్సైజ్ ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రైతుబీమా లెక్క గీత కార్మికుల కోసం బీమా పథకం పనిచేస్తుందని పేపర్లలో చదివి సంబురపడ్డం. ఆపద కాలంలో రూ.5లక్షల బీమా డబ్బులు బ్యాంకులో వేస్తామని చెప్పి గీత కార్మిక కుటుంబాలకు భరోసా ఇచ్చారు.
– రాపర్తి మోహన్ ,వెంకటాపూర్ మండలం,
పాలంపేట గ్రామం.
మేమంతా కేసీఆర్ వెంటే..
ఖానాపురం : రైతుబీమా తరహాలో గీతకార్మికుల కోసం బీమా సౌకర్యం కల్పిస్తూ వారి కుటుంబాల్లో భరోసా నింపుతున్న సీఎం కేసీఆర్‌కు మేమంతా రుణపడి ఉంటాం. తాటిచెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదాల బారిన పడడం నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. కొందరు మృత్యువాత పడితే మరికొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గీతన్న బీమాతో కార్మికుడు ప్రమాదంలో మృతిచెందితే వెంటనే అతడి ఖాతాలో రూ.5లక్షలు జమయ్యేలా సీఎం కేసీఆర్ పథకాన్ని రూపొందించడం చాలా సంతోషకరం. కార్మికులకు పెన్షన్, బీమా అలాగే నీరా కేఫ్‌ల ఏర్పాటుచేసిన కేసీఆర్ వెంటే ఉంటాం.
– ఉడుగుల కాశీనాథం, గీత కార్మికుడు, రాగంపేట
ఇదివరకు ఎవరూ పట్టించుకోలే..
స్టేషన్ ఘన్పూర్ : గీత వృత్తిని నమ్ముకుని బతికే మేము జీవనోపాధి లేక, చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. తాటిచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి ఏదైనా జరిగితే పరిహారం అందం ఆలస్యమై కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. మా సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్ రైతుబంధు తరహాలో బీమా పథకం ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. వారంలో బ్యాంకు ఖాతాలో రూ.5లక్షలు వేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారం కోసం గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటూ అండగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
– వంగ వేణు, కల్లుగీత కార్మిక సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి. శివునిపల్లి
బీమా అమలుతో అందరికీ మేలు..
బచ్చన్నపేట : గీత కార్మికులకు బీమా వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. సకల జనుల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మా కష్టాన్ని గుర్తించి రూ.5 లక్షల బీమా వర్తింపచేస్తున్నట్లు ప్రకటించడం సంతోషం. ఎంతోమంది కల్లు గీత వృత్తిపైనే ఆధారపడి బతుకుతున్నారు. తాటిచెట్టు ఎక్కితే కిందికి దిగేదాక ప్రాణం గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే. అలాంటి ప్రమాదకర వృత్తిలో కుటుంబాలు వెల్లదీస్తున్న మాకు ఈ బీమా ఎంతో భరోసా ఇస్తుంది. కేసీఆర్ మేలు మరువం. – అందె పరశురాములు, బచ్చన్నపేట
అటూఇటూ తిరుగుడు ఉండది..
ముఖ్యమంత్రి సారు గొప్ప మనసున్న మారాజు. కల్లు గీత వృత్తిని నమ్ముకొని బతుకుతున్న మా గీత కార్మిక కుటుంబాలకు భరోసా ఇచ్చిండు. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రైతుబీమా లెక్క నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల చాలా ఇబ్బందులు తప్పుతాయి. ఇంతకుముందు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి వచ్చే పరిహారం కోసం కాగితాలు పట్టుకొని చెప్పులరిగేలా తిరిగేవారు. చివరికి దళారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయేది. సీఎం కేసీఆర్ సారు పెట్టే స్కీం కష్టకాలంలో గీత కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
– బైరగాని సాంబయ్య, గీత కార్మికుడు, రేగొండ
మంచి నిర్ణయం
సీఎం కేసీఆర్ సారు తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిది. గౌడ కుటుంబసభ్యుల జీవితాలకు మరింత భరోసా కలిగిస్తది. గతంలో ఎవరైనా కల్లు గీత కార్మికుడు మరణిస్తే ఏండ్ల తరబడి పరిహారం కోసం ఇబ్బందిపడేది. ఇప్పుడు ప్రమాదవశాత్తు మరణించిన కల్లు గీత కార్మికుడి కుటుంబానికి రైతుబీమా తరహాలో నెలలోపే పరిహారం అందించడం ఎంతో మంచి నిర్ణయం. మాతో పాటు పేదోళ్లందరికీ మంచి పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ సారే మళ్లీ రావాలి.
– బండి రమేశ్ గౌడ్, గీత కార్మికుడు, రేగొండ
రుణపడిఉంటం
గోవిందరావుపేట : తాటిచెట్టు ఎక్కి దిగేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే మా గీత కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత భరోసా ఇచ్చిండు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ.5లక్షల బీమా ప్రకటించడం గొప్ప విషయం. ఎండనక, వాననక రోజుకు మూడు పూటలు ఎక్కి కల్లు గీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటం. గీత కార్మికుడికి ఏదైనా అయితే ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఆర్థిక సాయం అందించడం వల్ల భరోసాగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గౌడ కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాయి.
– జక్కు రవిగౌడ్, కేజీకేఎస్ సంఘం అధ్యక్షుడు, పస్రా
కొండంత భరోసా ఇచ్చిండు..
ములుగు రూరల్: ఎండనక, వాననక కుల వృత్తిని నమ్ముకొని బతికే మా కోసం సీఎం కేసీఆర్ బీమా పథకం తేవడం మంచి నిర్ణయం. ఈ పథకంతోని మా కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుంది. రూ.5లక్షల బీమా డబ్బులను వారం రోజుల్లోనే ఖాతాల్లో జమ అవుతాయని చెప్పి మంత్రులను ఆదేశించడం గొప్ప విషయం. గౌడ కులస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం మంచిగ పనిచేస్తున్నది. కులవృత్తులకు ఇలాంటి పథకాలు పెట్టడం వల్ల వీటిపై ఆధారపడి బతికే మా గౌడన్నలకు, వారి కుటుంబాలకు ధైర్యంగా ఉంటుంది.
– వీరగోని రవిగౌడ్, ములుగు
గౌడ కులస్తులకు అండాదండ..
కేసముద్రం : గౌడ కులస్తులను ఆర్థికంగా ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అండగా ఉంటున్నారు. గత పాలకులు మమ్ముల అస్సలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వైన్స్ షాపుల్లోనూ గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇచ్చారు. గీత వృత్తిని నమ్ముకొని బతుకుతున్న వారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని ప్రకటించడం ఎంతో మేలు చేస్తుంది. ప్రభుత్వం నీరాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి హైదరాబాద్‌లో నీరా కేఫ్ పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. గౌడ కులస్తులు సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలి.
– గందసిరి సోమన్న,
ఉద్యమకారుడు, కేసముద్రం
మనసున్న మారాజుకు కృతజ్ఞతలు
డోర్నకల్ : కల్లు గీత కార్మికుల కోసం బీమా పథకం తేవడం వల్ల ఆ కుటుంబాలకు కొండంత అండగా ఉంటుంది. గీత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. వృత్తికి సీఎం కేసీఆర్ పూర్వవైభవం తెచ్చారు. గీత కార్మికులు ఆర్థికంగా బలోపేతం కావడానికి హరితహారంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తాటి, ఈత చెట్లు నాటించారు. ఇప్పుడు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇస్తామని చెప్పడం గొప్ప నిర్ణయం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కల్లు గీత కార్మికులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– కళ్లెపు సతీశ్ కుమార్‌గౌడ్, అఖిల భారత గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, డోర్నకల్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

