ఖిలావరంగల్: ఖిలా వరంగల్ రోడ్డు రుద్రమాంబ నగర్లోని శ్రీ భూలక్ష్మి నాభిశిల బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. బొడ్రాయి వద్ద గణపతి పూజ, జలాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం చేశారు. 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్ బొడ్రాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అపరాధపు సారంగపాణి, వాసం సదానందం, మంతిని చక్రదారి, బేతి నర్సింహాస్వామి, కమ్మ రామ్మోహన్ రావు, నల్లకుంట రవికుమార్, కొత్తపల్లి శ్రీనివాస్, వడ్డెపెల్లి భరత్, సింగరబోయిన నాగరాజు, గుడికందుల క్రాంతి, పొన్నం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.