దేవరుప్పుల/పాలకుర్తి/ పెద్దవంగర, నవంబర్ 14 : తొర్రూరులో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపు మేరకు ప్రత్యేకం గా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. దేవరుప్పుల మండలం నుంచి 12వేల మంది తరలివెళ్లారు. మండల అధ్యక్షకార్యదర్శులు తీగల దయాక ర్, చింత రవి, మండల నాయకులు పల్లా సుందరరాం రెడ్డి, బస్వ మల్లేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ రాంసింగ్, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వీరారెడ్డి వృకోధర్‌రెడ్డి, మండ లశాఖ, గ్రామశాఖలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు, క్రియాశీలక సభ్యులు జనసమీకరణ చేశారు. పాలకుర్తి మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
పెద్దవంగర మండల వ్యాప్తంగా అ న్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో భా రీ గా తరలివెళ్లారు. వాహనాలను మండల కేంద్రంలో చెన్నూ రు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్రా వు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. తొ ర్రూరుకు తరలివెళ్లిన వారిలో పాలకుర్తి దేవస్థాన, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సం జ య్, మండల రైతు బంధు సమితి కన్వీన ర్ సోమారెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్య క్షుడు యాదగిరిరావు, సోమనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుధీర్‌కుమార్, శ్రీనివాస్, సునీల్ కుమార్‌రెడ్డి, మల్లికార్జునచారి, వెంకన్న, సుధాకర్, రాజు యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు ఉన్నారు.