భూపాలపల్లిరూరల్, సెప్టెంబర్ 16 : గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, కాంటినిజెంట్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, జీవో 64ను రద్దు చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లి గిరిజన (బాలికల) ఆశ్రమ పాఠశాల ఎదుట గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేస్తున్న డైలీవేజ్, కాంటినిజెంట్ వరర్లు సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తుండగా, మంగళవారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారికి మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను త్వరగా పరిషరించాలని కోరారు. అనంతరం భూపాలపల్లి గిరిజన (బాలికల) ఆశ్రమ పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 64 ద్వారా జీతాలను తగ్గించడం సరైంది కాదని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరర్లకు రావల్సిన ఆరు నెలల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల పక్కనున్న బాయ్స్ హాస్టల్‌ను వెంటనే వేరే చోటుకు మార్చాలన్నారు. ఈ మేరకు ఐటీడీఏ ఏపీవోతో ఫోన్లో మాట్లాడుతూ బాలికల హాస్టల్ పకనే బాయ్స్ హాస్టల్‌కు ఎలా పర్మిషన్ ఇస్తారని, ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. బాయ్స్ హాస్టల్ విద్యార్థులు గిరిజన (బాలికల) హాస్టల్ విద్యార్థులను ఫొటోలు తీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.