హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 12: ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళలు, పురుషుల ఖోఖో ఎంపికలు ఈనెల 19న(ఆదివారం) ఉదయం 9 గంటలకు హనుమకొండ జవహర్ లాల్ నెహ్రు స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలన్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు పెద్దపల్లి జిల్లాలో నవంబర్ 7 నుండి 9 వరకు జరిగే 58వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఇతర వివరాలకై వరంగల్ జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి తోట శ్యామ్ ప్రసాద్ ని 9849210746 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.