హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 29 : కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డ్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ వరంగల్ జోన్ క్రికెట్ పోటీలు యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్‌కాలేజీ మైదానంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో క్రికెట్ పోటీలను యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పోటీలలో వారి ప్రతిభను కనబరిచి కాకతీయ యూనివర్సిటీ టీంకి సెలెక్ట్ కావాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు మాట్లాడుతూ క్రికెట్లో ప్రతిభ కనబర్చి ఉన్నతంగా ఎదగాలన్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ పి.భాస్కర్, ఆర్ట్స్‌కాలేజీ పీడీ ఏటివిటీ ప్రసాద్, యూనివర్సిటీ కాలేజ్ పీడీ ఎస్.కుమారస్వామి, ఆర్గనైజింగ్ కమిటీ మహ్మద్ అఫ్జల్, మట్టెడ కుమార్, మహ్మద్ అలీ, ఎర్ర సుమన్, పీడీలు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, జి.శశికాంత్ పాల్గొన్నారు.