గోవిందరావుపేట, జూన్ 9: పర్యాటక ప్రాంతమైన సరస్సులో నీరు లేక అధికారులు బోటు షికారు దీంతో పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్తున్నారు. జూన్ 2వ తేదీ నాటికి సరస్సులో 17అడుగుల నీటిమట్టం ఉండటంతో తూములు చేయాలంటూ ఐబీ అధికారులు వదిలారు. దీంతో సరస్సు డెడ్ స్టోరేజ్‌కు వచ్చింది. బోట్లు నడిచేందుకు సరస్సులో సరిపడా నీరు లేకపోవడంతో ఈనెల 6వ తేదీ నుంచి టూరిజం అధికారులు బోటు షికారు నిలిపేశారు. ఐబీ అధికారులు మరమ్మతుల పేరుతో నీటిని వదలడంతో మళ్లీ సమృద్ధిగా వర్షాలు పడి సరస్సు నిండితేనే బోటు షికారు ప్రారంభం కానున్నది.