చారిత్రక ఖిల్లాలో కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యం నిలువెల్లా కనిపిస్తున్నది. కాకతీయుల కళా వైభవాన్ని వీక్షించకుండా కట్టడాలకు ఏండ్ల తరబడి తాళాలు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఇక్కడి అద్భుత శిల్ప కళ నేటికీ మరెన్నో తరాలకు కనువిందు చేస్తూనే ఉంటుంది. పర్యా టకుల ఆనందానికి పరిశీలకుల అంచనాలకు భిన్నంగా చారిత్రక ప్రాశస్త్యం వెలకట్టలేనిది. అలాంటి విశ్వవ్యాప్తమైన కోటలోని ఆలయాలు, చారిత్రక కట్టడాలను పరిరక్షణ పేరుతో కేంద్ర పురావస్తు శాఖ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసింది. గేట్లు ఏర్పాటు చేసి వాటికి తాళాలు వేయడంపై పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
– ఖిలావరంగల్, జనవరి 16
కోటలోని కాకతీయుల శిల్ప కళా సంపదను ప్రత్యక్షంగా వీక్షించి అనుభూతి పొందేందుకు దూరతీర ప్రాంతాల నుంచి పర్యాటకులు వేల సంఖ్య లో వస్తుంటారు. వారికి ఏ కట్టడం ఎక్కడ ఉందో తెలియక ఆందోళన చెం దుతుంటారు. అతికష్టం మీద స్థానికుల ద్వారా ఆలయాలు, ఇతర కట్టడా ల దారి తెలుసుకొని వెళ్లే సరికి అక్కడ లోనికి వెళ్లకుండా తాళాలు వెక్కిరిస్తుంటాయి. దీంతో పర్యాటకులు పురావస్తు శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీక్షించకుండానే వెనుతిరుగుతుంటారు.
గుళ్లు, గోపురాలు.. నిర్మాణ సౌధా లు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో వాటికి తాళాలు వేయడంపై పర్యాటకులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటలో పదుల సంఖ్యలో చారిత్రక సౌధాలు ఉన్నా కేవలం కీర్తితోరణాల మధ్య ఉన్న శిల్ప సంపద, ఖుష్మహల్, ఏకశిలగుట్ట అనే పరిస్థితికి కేంద్రపురావస్తుశాఖ తీసుకువచ్చిందనే విమర్శలున్నా యి. ప్రస్తుతం పెరుగుతున్న ప ర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ప్రతి చారిత్రక కట్టడం వద్దకు సులువుగా వెళ్లేలా సూ చిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆలయా లు, కట్టడాలకు వేసిన తాళాలను తీసి ప ర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.
తాళాలు వేసిన ఆలయాలు ఇవే..
కోటలోని జంగమయ్య గుడి(మేడరాయుడిని ఆలయం), కొండ గుడి, నేలశంభుని ఆలయం, మండలమ్మ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, మందు గుండు సామగ్రి భద్రపరిచే గది నిర్మాణాలను బహు ముచ్చటేస్తుంటాయి. ఆగమ శాస్త్రం ప్రకారం అద్భుతంగా ఒక్కొక్క ప్రత్యేకతతో వీటి నిర్మాణం చేశారు.