కృష్ణకాలనీ, జూన్ 20 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి దిమాక్లేని మాటలు మాట్లాడుతున్నాడని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబం ధం లేకుండా రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ జిల్లాకేంద్రంలోని అంబేదర్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి రైతు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎమ్మె ల్యే గండ్ర, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టే కుట్ర చేస్తుందని, ఎలాం టి యాప్‌లు లేకుండా నేరుగా యూరియా అందజేయాలని డిమాండ్ చేశా రు. శుక్రవారం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనకుంటే తాము కూడా కొనలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు.
కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సన్న ధాన్యం కొంటామని చెప్పి, కేవలం ఏడు రకాల వడ్లను మాత్రమే ఎం దుకు కొంటామంటున్నాడో రైతులకు చెప్పాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం ఉ దయం మాత్రమే ఇస్తున్నదని, అది కూడా టిప్‌లతో కూడిన సగం కరెంటు వస్తున్నదన్నారు. కేసీఆర్ పాలనలో రైతు వేదికలు నిర్మిస్తే, కాంగ్రెస్ పాలనలో నిరుపయోగంలో ఉన్నాయని, వెంటనే వాటిని వినియోగంలోకి తేవాలన్నారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని నీళ్లతో రాజకీయాలు చేయొద్దని, ఆ రెండు ప్రాజెక్టుల నుంచి పంపింగ్ చేసి రైతులకు సాగునీరు అందింలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను అధికంగా పెంచిందని, వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి
రైతులకు కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, పెట్టుబడి సాయం ఇచ్చి తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి తెలిపారు. గతంలో తెలంగాణలో 60 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం మాత్రమే పండించే వారని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే తెలంగాణగా తయారు చేశారన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో కరువు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతు బిడ్డని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి వారిని అన్ని రం గాల్లో మోసం చేస్తున్నాడన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర, రాకేశ్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై వదిలేశారు. బీఆర్ఎస్ అర్బన్ మాజీ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ ఫ్లోర లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, నాయకులు సెగ్గం సిద్ధు, మాడ హరీశ్‌రెడ్డి, గొర్రె సాగర్, లక్ష్మీనర్సింహారావు, పూర్ణచంద్రారెడ్డి, రాజేందర్, కౌన్సిలర్లు కట్ల పూర్ణచందర్, రత్నం సుమంజలి, మోతె రాజు, జ్యోతుల మం జుల, బుర్ర రమాదేవి, బొంతల సతీశ్‌కుమార్, బోగం నరేందర్, బెజ్జల శ్యా మల, జక్కం రవికుమార్, ప్రవీణ్ కుమార్, యుగేంద్రాచారి పాల్గొన్నారు.