ఈ వారం రాశి ఫలాలు.. ఆగస్ట్ 09. 8 .2026 నుంచి 15.08.2026 వరకు
ఉద్యోగులకు యోగ్యమైన సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువర్గంతో మనస్పర్ధలు ఉండవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
మేషం
ఉద్యోగులకు యోగ్యమైన సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువర్గంతో మనస్పర్ధలు ఉండవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
వృషభం
ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. గిట్టనివారితో సమస్యలు రావొచ్చు. వృథా ఖర్చులు ఉంటాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకోండి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. శివారాధన శుభప్రదం.
మిథునం
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయపాలన పాటించడం అవసరం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. కొత్త పనులు చేపట్టకుండా చేతిలో ఉన్నవాటిపై దృష్టి సారించడం అవసరం. ఆవేశం వల్ల కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు. వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం మేలు చేస్తుంది.
కర్కాటకం
ఈ వారం శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. గిట్టనివారు పనులు చెడగొట్టడానికి ఎంత ప్రయత్నించినా విఫలమవుతారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
సింహం
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు పనివారితో చికాకులు తలెత్తవచ్చు. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఓ పట్టాన ముందుకు కదలవు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. భూమి కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.
కన్య
ఉద్యోగంలో పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ వారం అనుకూలం. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల ప్రయోజనం పొందుతారు.
తుల
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సోదరులతో సఖ్యతతో మెలగండి. వ్యాపారులకు మంచి సమయం. ఆర్థికంగా పుంజుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి.
వృశ్చికం
గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన పాటించడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. శివారాధన వల్ల శుభఫలితాలు అధికమవుతాయి.
ధనుస్సు
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటించండి. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.
మకరం
గురు అనుగ్రహంతో ఆకస్మిక మేలు జరుగుతుంది. మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపర్చడంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం వల్ల శుభం కలుగుతుంది.
కుంభం
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచిపేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరమవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.
మీనం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

