వనపర్తి టౌన్, ఆగస్టు 8 : కేఎల్ఐ పంపుల ప్రారం భం ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ విజయమేనని బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ నాయకులు శనివా రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హ యాంలో కేసీఆర్ నిరంతరం రైతుల సంక్షేమం కో సం జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యతను ముందే పసిగట్టి రిజర్వాయర్లు నింపి పంటలు పండించి సస్యశ్యామలం చేశారని కానీ నేటి ప్రభుత్వం ఆం ధ్రా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఉన్న సాగు జలాలు వినియోగించుకోవడంలో దారుణంగా విఫలమైందన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు 2.30లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని వరద నీటిని సద్వినియోగం చే సుకొని రిజర్వాయర్స్ నింపి వానకాలం, యాసం గి పంటలకు సాగునీళ్లు ఇవ్వాలన్నారు. మాజీ మం త్రి నిరంజన్‌రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ ముట్టడి చేస్తామని హెచ్చరించిన తర్వాత ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి రిజర్వాయర్‌లో మూడు పం పులు ప్రారంభించారని గుర్తుచేశారు. ఎల్‌నినో పేరిట కేఎల్ఐ నుంచి ఒక పంపు మాత్రమే ప్రారంభించి పంపులు ఆన్ చేశామనడం ప్రభుత్వ అవివేకమన్నారు. ఈ నెల 7వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి 11వ తేదీన నార్లాపూర్ ముట్టడిస్తామని హెచ్చరికలు చేసిన తర్వాతే కాల్వలకు నీళ్లు వదిలారని అన్నారు.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అవగాహన రాహిత్యంతో ప్రకటనలు విడుదల చే స్తూ ప్రజలలో చులకన అవుతున్నారని ఆరోపించా రు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి ప్రాజెక్టులపై, సా గు జలాలపై అవగాహన లేదని ఎమ్మెల్యే మాట్లాడడం హాస్యాస్పదం అని అన్నారు. ఇప్పటికే గుడిపల్లి రిజర్వాయర్‌లో నీళ్లు ఎత్తిపోస్తున్నారు కానీ కా ల్వలకు ఈ క్షణం వరకు వదల్లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికల తర్వాతనే ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిలలో మోటర్లు ఆన్ చేశారని, తాగునీటి కోసం ఎల్లూరు, గుడిపల్లి, జొన్నలబొగుడ రి జర్వాయర్లు నింపేందుకు ప్రయత్నించారని, కానీ రైతులకు సాగునీరు ఇవ్వడానికి కాదని, ఇప్పటికి కూడా ఎక్కడా రైతులకు సాగునీరు విడుదల చేయ డం లేదన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేఎల్ఐ పరిధిలోని 500 చెరువులు, కుంట లు వెం టనే నింపి సాగునీరు అందించాలని అన్నా రు. బీ ఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో మోటార్లు ఆన్ చేసిందని, శుక్రవా రం సాయంత్రం వరకు ఎల్లూరు , జొన్నలబొగుడల లో నడిచింది ఒకటే మోటర్ అని ప్రస్తుతం జొ న్నలబొగుడలో ఒక్కటే మోటర్ నడుస్తుందని అ న్నా రు. గుడిపల్లిలో ఈ క్షణం వరకు నీళ్లు విడుదల చే యలేదని బీఆర్ఎస్ హెచ్చరికలతో కాంగ్రెస్ నేత లు అబద్ధాల ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా వానకాలం యాసంగి పం టలకు సాగునీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మాణిక్యం, గంధం పరంజ్యోతి, ఉం గ్లం తిరుమల్, ధర్మశాస్త్ర, మహేశ్వర్‌రెడ్డి, జోహెబ్ హుస్సేన్, సయ్యద్, జమీల్, పాండు ఉన్నారు.