ముల్లంగి ఆకుల పచ్చడి
ముల్లంగి ఆకులను కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. ఉల్లిగడ్డలను కూడా ముక్కలు చేసుకోవాలి. మామిడి కాయను చెక్కుతీసి తురుముకోవాలి. అది లేకపోతే చింతపండు వేసుకోవచ్చు. పొయ్యి మీద బాణలి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపపప్పు వేసి బంగారు రంగులోకి రానివ్వాలి.
ముల్లంగి ఆకులు: నాలుగు గడ్డలకు వచ్చినవి పచ్చి మామిడి: చిన్నది ఒకటి లేదా చింతపండు: చిన్న నిమ్మకాయంత ఉల్లిపాయలు: రెండు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు, మినపపప్పు: టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు: అర స్పూను, పసుపు: పావు స్పూను మెంతులు: పావు స్పూను, ఇంగువ: చిటికెడు ఎండు మిరపకాయలు: రెండు పచ్చిమిరప కాయలు: నాలుగు ఉప్పు: తగినంత, కొత్తిమీర: చిన్న కట్ట
తయారు చేసే విధానం
ముల్లంగి ఆకులను కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. ఉల్లిగడ్డలను కూడా ముక్కలు చేసుకోవాలి. మామిడి కాయను చెక్కుతీసి తురుముకోవాలి. అది లేకపోతే చింతపండు వేసుకోవచ్చు. పొయ్యి మీద బాణలి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపపప్పు వేసి బంగారు రంగులోకి రానివ్వాలి. తర్వాత ఎండు మిరపకాయలు, కొద్దిగా ఇంగువ కూడా జోడించాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసి వేగాక పోపును తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ, మామిడి తురుము, తరిగిన ఆకును కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. అందులో ఉప్పు, పసుపు వేసి దింపుకోవాలి. ఒకవేళ మామిడికాయ అందుబాటులో లేకపోతే చింతపండు గుజ్జు వేసుకోవచ్చు. ఇప్పుడు, ఇందాక తీసి పెట్టుకున్న పోపు మిశ్రమం చల్లారగానే మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అందులోనే మగ్గిన ఆకు, ఉల్లిపాయలు వేసి, రెండు తిప్పులు తిప్పాలి. చివర్లో కొత్తిమీర చల్లి కలుపుకొంటే విభిన్నమైన రుచితో ముల్లంగి ఆకుల పచ్చడి ఆరగించేయొచ్చు.
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

