వర్ధన్నపేట, నవంబర్ 2: బీఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధించాలంటే కార్యకర్తలు ప్రతి వెళ్లాలని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ 100 ఓట్ల ఇన్చార్జిల అవగాహన సదస్సుకు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి కలిసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. అందుకోసం 100 ఓటర్లకు ఒక ముఖ్య కార్యకర్త చొప్పున బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. వార్డులోని పార్టీ నాయకులతో కలిసి బాధ్యులు ప్రచారం నిర్వహించాలని సూచించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిన తీరు ప్రజలకు వివరించాలని అన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో సాధించిన ప్రగతితో పాటుగా పేదల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను రూపకల్పన చేసినట్లు చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఏవిధంగా ఇబ్బందులకు గురయ్యారనేది కూడా ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తే రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి ఏవిధంగా అన్యాయం చేస్తున్నదో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు.
హసన్‌పర్తి: ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ప్రతి కార్యకర్త వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎర్రగట్టుగుట్ట సమీపంలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో హసన్‌పర్తి మండల బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్ ఆధ్యర్యంలో మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బూత్ ఇన్చార్జిలు, 100 ఓట్ల ఇన్చార్జిలు, ముఖ్య కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే అరూరి రమేశ్, రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న హాజరై మాట్లాడారు. ప్రతి కార్యకర్త ఓటర్ వద్దకు వెళ్లి కేసీఆర్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో అంశాలను వివరించాలన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందన్నారు. పార్టీ ఎన్నిక పరిశీలకుడు సత్యప్రసాద్, ఎంపీపీ సునీత, జడ్పీటీసీ సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్ అంచూరి విజయ్‌కుమార్, పాక్స్ చైర్మన్ జక్కు రమేశ్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ సుభాశ్‌గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఐనవోలు: ఎన్నికల్లో బీఆర్ఎస్కు లక్ష ఓట్ల మెజార్టీ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్లో సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ ఇన్చార్జిలు, 100 ఓట్ల ఇన్చార్జిలు, పార్టీ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, మండల సమన్వయ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి హాజరై మాట్లాడారు. కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించాలని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఏమీచేయరని, నియోజకవర్గ ప్రజల మద్దతు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. కాగా, ఒంటిమామిడిపల్లి, కక్కిరాలపల్లికి చెందిన 50 మంది నాయకులు, యువకులు కాంగ్రెస్, బీజేపీ నుంచి మండల కేంద్రంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రజా ఆశీర్వాద సభలో ల్యాండ్ పూలింగ్ ఉండదని హామీ ఇవ్వడం, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అంశాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఎంపీపీ మార్నేని మధుమతి, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, సొసైటీ వైస్ చైర్మన్లు చందర్రావు, బాబు, స్థానిక సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు సోమేశ్వర్రావు, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ పొన్నాల రాజు, కట్కూరి రాజు, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, రాజశేఖర్, సురేశ్, రాజు, గుంషావళి, కోమలత, డీకే, నరేశ్ పాల్గొన్నారు.