వర్ధన్నపేట, డిసెంబర్ 23 : కుల మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజల సంతోషమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. క్రిస్మస్ను పురస్కరించుకుని మండలంలోని నల్లబెల్లి గ్రామంలో పేద క్రైస్తవులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకలను ఎమ్మెల్యే రమేశ్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముత్యం దేవేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలు, కులాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సమానస్థాయిలోనే గౌరవిస్తారన్నారు. విపక్ష పార్టీల నాయకులు రాష్ట్రంలో కులమతాలుగా ప్రజలను విడదీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు దీన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. క్రిస్మస్ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే, నల్లబెల్లి, రాంధాన్తండాకు చెందిన పలువురు లబ్ధిదారులకు రూ.2.65లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఉపసర్పంచ్ చంద్రయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు ఐలయ్య, వాసుదేవరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.
సీతంపేట గ్రామంలో..
హసన్‌పర్తి : క్రిస్మస్ను పురస్కరించుకుని మండలంలోని సీతంపేటలో క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకలు పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్, సర్పంచ్ శరత్, మార్కెట్ డైరెక్టర్లు వీసం సురేందర్‌రెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని నాగారంలో పోరెడ్డి రాఘవరెడ్డి మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. రాఘవరెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హసన్‌పర్తిలో జరిగిన పీవీ నర్సింహారావు సంస్మరణ సభకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ హాజరై పీవీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి నాయకులు పాల్గొన్నారు.