సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్)అనే ప్రత్యేక విభాగాన్ని గురువారం గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు.
ఆహార కల్తీకి వ్యతిరేకంగా పక్కా సమాచారంతో పటిష్టమైన యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకోవడానికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సహా 28 మంది సిబ్బంది ఉంటారని చెప్పారు. ఎక్కడైనా ఆహార కల్తీ జరుగుతున్నట్లు సమాచారం అందించేందుకు 8712661212 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు.