నర్సింహులపేట, ఫిబ్రవరి 22 : పంటను కాపాడుకునేందుకు రైతులు ఎప్పుడూ లేని కష్టాలు పడాల్సి వస్తోంది. చెరువుల్లో నీళ్లులేక భూగర్భజలాలు అడుగంటిపోవడం, ఎస్సారెస్పీ కాలువలో వారానికోసారి వచ్చే నీళ్లు ఎండిన కాల్వ తడవడానికే సరిపోవడం, ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఎక్కువ కావడంతో సాగునీటికి అల్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చేసేదే మీ వేలకు వేలు ఖర్చు పెట్టి బావులను పూడిక తీయిస్తూ క్రేన్ సహాయంతో ఎక్కువ లోతు తవ్విస్తున్నారు. అలాగే కొత్త బోర్లు వేస్తున్నారు. నర్సింహులపేట మండలం నర్సిహపురం బంజర గ్రామంలో బావుల్లో ఊట తక్కువ కావడంతో వరి పొలం నెర్ర లు బారింది. వాగులు వంకలు ఒ ర్రెల నుంచి ఇసుకను తరలించడంతో భూగర్భజలాలు అడగుంటున్నాయి.
గతేడాదితో పోలిస్తే మీట ర్ లోతులోకి నీరు వెళ్లిందని రైతులు చెబుతున్నారు. రైతులు సొంత ఖర్చులతో ఉప కాలువలో చెత్తాచెదారం తొలగించినా చుక్కనీరు రావడం లేదంటున్నారు. దీనికి తోడు వర్థరాజులకుంట పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటి వరికి చేతికి వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నారు. వందల ఫీట్లు బోరు వేసినా నీరు ధారలాగే వస్తున్నదని ఇలాగైతే యాసంగి వరి పంట చేతికొచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తంచేసున్నారు. ఐదేళ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదని చెబుతున్నారు. మరో నెల రోజుల్లో పంట చేతికి అందుతుందనుకున్న సమయంలో బోర్లు, బావులు ఎండిపోతుండడం పంట పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని నర్సింహులపేట మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఐదేళ్లలో ఎప్పుడూ ఎండిపోలే
ఐదేళ్లగా బావిలో నీరు తగ్గిందిలేదు. పంట ఎండిపోయింది లేదు. బోరు నుంచి చిన్నధారల నీరు వస్తుంది. దీంతో రెండు వరి మళ్లు పారుతున్నాయి. ఇప్పుడే వరుస తాళ్లు పెట్టే పరిస్థితి ఉంది. వరి వేసి రెండు నెలలైతాంది. ఇప్పుడే పంటకు నీరు అందక ఇబ్బందైతాంది. ఇంకా నెల పదిహేను రోజులు పంటకు నీళ్లు పెట్టుడు కష్టంగానే ఉన్నది. పంట చేతికొచ్చుడు కష్టమే.
– గుగులోత్ గింధీ, రూప్లాతండా
మక్కజొన్న చేతికొచ్చేలా లేదు
ఐదేళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి చూడలేదు. బావి లో నీరు దొరికే అవకాశం లేదు. రెండు ఎకరాలు మిరుప, ఎకరం మక్కజొన్న వేసిన రెండు పంటలకు నీళ్లు పెట్టుడు ఇబ్బందిగా ఉంది. మక్కజొ న్న చేతికి వచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయే అవకాశం ఉంది.
– గుగులోత్ హము, రూప్లాతండా