శుక్రవారం భట్టుపల్లిలో జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ కనిపించింది. సభలో ఆద్యంతం కార్యకర్తలు హుషారుగా కనిపించారు. సీఎం ప్రసంగిస్తున్నంత సేపు ఈలలు వేస్తూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వేదిక వద్ద రంగులతో పటాకులు పేల్చారు. దీంతో ఆ ప్రాతం గులాబీమయమైంది.