జనగామ, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి ఫలించింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతోపాటు పరిసర గ్రామాలైన వల్మీడి, బమ్మెర చరిత్రాత్మక ప్రాంతాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితంగా ప్రత్యేక నిధులతో టూరిజం కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా కారిడార్ కేంద్రంగా ఉన్న పాలకుర్తిలో హరిత టూరిజం హోటల్ ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంకల్పించారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన టూరిజం హరిత హోటల్ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే దీనికి సంబంధించి పరిపాలన అనుమతి ఇస్తూ రూ.25 కోట్లు విడుదల చేస్తూ సాధ్యమైనంత త్వరగా ఆ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం బుధవారం రాత్రి జీవో 48ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తిలో టూరిజం హరి త హోటల్ ఏర్పాటు చేయాలని కోరగానే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఇకడ హో టల్ నిర్మాణమైతే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పాలకుర్తికి వచ్చే టూరిస్టులు, భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇకడకు వచ్చే భక్తులకు పాలకుర్తిలో బస చేయడానికి వీలు కలుగుతుందని, ఈ ప్రాంత అభివృద్ధికి టూరిజం హోటల్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. హరిత హోటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం, కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.