వరంగల్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఊహించినట్లుగానే కాంగ్రెస్ సర్కార్ రైతులను నమ్మించి మోసం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Ex-minister Koppula) ఆరోపించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా(Raitu Barosa) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ ప్రకటించడం రైతులను నమ్మించి గొంతు కోసిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చాక రైతు బంధు కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన డబ్బునే ఇచ్చి రెండు పంటలకు ఇవ్వకుండా ఎగబెట్టిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, కూలీలకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వంచించి మోసం చేసిందని విమర్శించారు.
రైతులు తీసుకున్న రుణమాఫీ ఏక కాలంలో మాఫీ ఇప్పటికీ నెరవేర లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రావడానికి వంద హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.