మల్లంపల్లి, ఆగస్టు 7 : ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న కెనాల్ బ్రిడ్జి గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కుంగిపోయింది. గతంలో కుంగిపోవడంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజు రు కాగా అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ ఆరు నెలుగా పనులు చేపడుతున్నాడు. కాల్వపై బ్రిడ్జి ఉండడంతో కింది భాగంలో నీళ్లు వెళ్లేందుకు పైపులు వేశారు. పైపు లు, బ్రిడ్జికి మధ్యలో గతంలో నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు, మట్టి ఉంది. ప్రస్తుతం అవి కూలిపోవడంతో బ్రిడ్జి కుంగిపోయింది.
సమాచారం అందుకున్న ములుగు ఎస్సై వెంకటేశ్వరరావు, సిబ్బందితో బ్రిడ్జి వద్దకు చేరుకొని వాహనాల రాకపోకలు నిలిపివేశారు. హనుమకొండ వైపు వచ్చి ఆగి ఉన్న వాహనాలను పందికుంట, రాంచంద్రాపూర్, శ్రీనగర్ వయా మల్లంపల్లి జాతీయ రహదారిపైకి మళ్లించారు. అదేవిధంగా ఆత్మకూరు వద్ద వాహనాలు నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం వాహనాలేవీ బ్రిడ్జి వైపు రానివ్వడం లేదు. హనుమకొండ నుంచి వచ్చే వాహనాలు పరకాల నుంచి గణపురం క్రాస్ నుంచి బుద్దారం మీదుగా ములుగుకు తరలిస్తున్నారు.
అదేవిధంగా ఏటూరునాగారం నుంచి హనుమకొండ వైపునకు వెళ్లే వాహనాలను అబ్బాపురం క్రాస్, రేగొండ, పరకాల మీదుగా గూడెప్పాడ్ తరలిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో బ్రి డ్జి ఎంత వరకు కుంగిందనేది తేలడం లేదు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీనగర్, అబ్బాపూర్ క్రాస్తో పాటు ప్రధాన రహదారిపై పోలీసులు చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేసి పహారా కాస్తున్నా రు. కాగా, నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీ ల రవాణా జరుగుతుండడం సైతం బ్రిడ్జి కుంగడానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
12 నుంచి పలు రైళ్లకు అదనపు బోగీలు
కాజీపేట, ఆగస్టు 7 : ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే పలు రైళ్లకు ఈ నెల 12 నుంచి అదనపు బోగీలు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రోజూ గుంటూరు-సికింద్రాబాద్-గుంటూర్ల మధ్య నడిచే రైలు నంబర్ 12705/ 12706 ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు 1 చైర్ కార్, ఒకటి 3ఏ(ఈ) రెండు బోగీలు, విజయవాడ- కాచిగూడ- విజయవాడల మధ్య నడిచే 12713/12714 శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒకటి ఏసీ చైర్‌కార్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే 12757/12758 కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక 3ఏ(ఈ) బోగీని పెంచుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ రైళ్ల ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులు అదనపు బోగీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.