హనుమకొండ, ఏప్రిల్ 15 : ఉపాధి హామీ కూలీల వేసవి భత్యానికి కేంద్ర ప్రభు త్వం ఎగనామం పెట్టింది. ప్రతి సంవత్స రం ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలకు అదనంగా ఇచ్చే వేసవి భృతి ఇవ్వడం లే దు. కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యం ఆప్షన్ అసలు కనిపించడం లేదు. ఇప్పటికే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకొని పనిదినాలకు కోత పెట్టింది. పథకానికి నిధుల కేటాయిం పు సైతం పెద్ద మొత్తంలో తగ్గించింది. ఇటీవల ఉపాధి కూలిని కంటితుడుపుగా రూ.15 పెంచి చేతులు దులుపుకుందని ప లువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాలతో పనిదినాలు తగ్గడం తో పాటు కూలి గిట్టుబాటు కావడంలేదని, వేసవి భత్యం లేకుండా పోయిందని మం డిపడుతున్నారు. దీంతో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2005 లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా లక్షల మంది కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. గత సంవత్సరం వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లడంతో సమస్యలు ఉత్పనం అవుతున్నాయి. తెలంగాణ సర్కారు పర్యవేక్షణలో ఉన్నప్పుడు రాగన్ సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి కూలీలు, పనులు, కూలీల సంఖ్య, వేసవి భత్యం తదితర సమాచారం నమోదు చేసేవారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఐసీ కొత్త సాఫ్ట్‌వేర్‌లో కొన్ని ఆప్షన్లు కనిపించడం లేదని డీఆర్డీఏ శాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడే ఉపాధి కూలీలకు లబ్ధి చేకూరేదని కూలీలు అంటున్నారు. కాగా, హనుమకొండ జిల్లా 12 మండలాల్లోని 208 గ్రామ పంచాయతీలునానరు. 1.92 లక్షలకుపై కూలీలు ఉండగా ఉపాధి పనులకు వచ్చే వారు సుమారు లక్ష మంది ఉం టారని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఇపుడు కేంద్రం ప్రభుత్వ చెప్పినట్లుగా దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పనులు చేపట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆన్లైన్, సాఫ్ట్వేర్ సమస్యలు వస్తే పరిష్కరించడం లో జాప్యం జరుగుతోంది. అలాగే, నిధుల కేటాయింపులో కూడా కేంద్రం కోత విధించింది. పేదల నోట్లో మట్టికొట్టేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీలు, చిన్న, సన్నకారు రైతులకు సైతం అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకంలో పనిదినాలు, నిధులు తగ్గించిన మోదీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపాధి పథకంలోని కూలీలకు ఇచ్చే కూలి కంటితుడుపుగా మాత్రమే పెంచిందని పలువురు కూలీలు వాపోతున్నారు. గతంలో రూ. 257 ఉండగా రూ.15 పెంచగా ప్రస్తుతం రూ.272కు పెరిగింది. ఈ పెరిగిన కూలి గత మార్చి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూలి పెంచినా కూలీలు మాత్రం సంతోషం వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుతం రోజు రూ.140 నుంచి రూ. 160 దాటడం లేదని వాపోతున్నారు. పని రేటు పెంచకుండా కూలి పెంచడం వల్ల తమకు ఒరిగేది ఏమి లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పని రేటు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఈ సంవత్సరం నుంచి వేసవి అలవెన్స్‌కు కేంద్ర ప్రభుత్వ ఎగనామం పెట్టింది. ఇప్పటిక వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను చేపట్టేవారు. దీంతో ప్రతి సంవత్సరం కూలి డబ్బులకు అదనంగా వేసవి భత్యం చెల్లిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్, మేలో 30 శాతం చొప్పున అదనంగా చెల్లించేవారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌లో వేసవి అలవెన్స్ ఆప్షన్ లేదని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఈ సంవత్సరం వేసవి భత్యం ఉంటుందో ఉండదోనని పలువురు కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వేలేరు, ఏప్రిల్ 15 : గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేసవి భత్యం చెల్లించాలి. ఎండా కాలం ఉపాధి పనులకు పోతే కూలితో పాటు అదనపు భత్యం కలిపి కొంచెం ఎక్కువగా వచ్చేది. కూలి రేటు పెంచినం అంటున్నారు. అయినప్పటికీ గిట్టుబాటు కావడం లేదు. రోజంతా కష్టపడితే రూ. 140 వరకు వస్తుంది. ప్రభుత్వం కూలి రూ. 272కు పెంచడం వల్ల ఒరిగిందేమీ లేదు.
– భూక్యా శారద, బండతండా గ్రామం
ఉపాధి హామీ పథకంపై కేంద్రం కొర్రీలు పెడుతోంది. పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నుతోంది. అందుకే వేసవికాలంలో కూలీలకు అందించే భత్యాలను పూర్తిగా నిలిపివేసింది. గ్రామాల్లో మధ్యతరగతి చెందిన వారు ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పాటు పని చేసుకుంటూ జీవనోపాధి పొందేవారు. మాకు ఎండాకాలంలో పనులు కొంతమేర కల్పించేది. ఉపాధిహామీ పథకాన్నే లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతుంది. కూలీల వేసవి కాలపు అదనపు భత్యాలను నిలిపివేసి, కంటి తుడుపు చర్యగా కూలి డబ్బులను స్వల్పంగా పెంచడం సరికాదు.
– వేముల రాజు, పీచర, వేలేరు మండలం