న్యూశాయంపేట/మడికొండ, ఆగస్టు 8 : రాష్ట్రంలోని ప్రజలకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చి అ న్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట సోమిడిలోని కమ్యూనిటీ హాల్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు 63వ డివిజన్‌కు చెదిన బీఆర్ఎస్ కార్యకర్త బాదనపురి హరిప్రసాద్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో క్రియాశీల సభ్యత్వం కింద మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును చీఫ్‌విప్ స్వయంగా వెళ్లి హరిప్రసాద్ భార్య స్వప్నకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపి, 43వేల కుటుంబాలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. చివరి శాసన సభ సమావేశాలను విజయవంతంగా పూర్తి చేశామని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి హుందాగా వ్యవహరించామన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని, ప్రతి మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలతో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. గృహలక్ష్మి పథకానికి అర్హులైన వారు ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యం..
దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేటలోని అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దార్ సమక్షంలో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ మాట్లాడుతూ 300 గజాల్లో నిర్మించే ఈ భవనం స్థానికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళలు, యువత ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
గద్దర్ ప్రజల హృదయాల్లో నిలిచారు
తెలంగాణ కోసం తన ఆటపాటతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ప్రజాగాయకుడు గద్దర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట చౌరస్తాలో గద్దర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో 63వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బెదరకోట రంజిత్‌కుమార్, మిట్టపల్లి రవీందర్, సోనీ సయ్యద్ సర్వర్, షేక్ మహమూద్, బరిగెల వినయ్, బండి రామచందర్, పడిదెల శేఖర్, మంద శ్రీనివాస్, బొల్లె కుమార్, ఎండీ రైస్, చిట్యాల మహేశ్, నిషాని వెంకట్, విష్ణుమూర్తి, సంపత్ పాల్గొన్నారు.