హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 24 : స్టార్ డైరెక్టర్ మారుతీ సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్‌రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రబృందం సందడి చేసింది. ఆదివారం హనుమకొండలోని శ్రీదేవి ఏషియన్మాల్లో(Barbarian movie) ‘స్పెషల్ ప్రీమియర్ షో’ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స, ప్రొడ్యూసర్ విజయపాల్‌రెడ్డి, నటి ఉదయభాను, ఇతర నటీనటులు వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రముఖులతో పాటు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కూడా ప్రీమియర్ షోను తిలకించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స, ప్రొడ్యూసర్ విజయపాల్‌రెడ్డి, నటి ఉదయభాను మాట్లాడుతూ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు, ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేశాయన్నారు. ఇంకా ఈ మూవీలో సత్యరాజ్ ప్రముఖ పాత్ర పోషించారని, ప్రజలు చిన్న సినిమాను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు వెంకటేశ్వర్లు, సురేష్, సతీష్ పాల్గొన్నారు.