Sensational Comments | చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యిలో బాత్రూం క్లీనర్ కెమికల్
Sensational Comments | తిరుమల లడ్డూ లో జంతువుల కొవ్వు కలిపారని నిన్న, మొన్నటి వరకు ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈసారి మరో కెమికల్ కూడా కలిసిందని బాంబు పేల్చారు.
తిరుమల : తిరుమల లడ్డూ ( Tirupati laddus ) లో జంతువుల కొవ్వు కలిపారని నిన్న, మొన్నటి వరకు ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu) ఈసారి మరో కెమికల్ కూడా కలిసిందని బాంబు పేల్చారు. కల్తీ నెయ్యిలో బాత్రూం క్లీన్‌లో ఉపయోగించే లప్సా కెమికల్‌ను కలిపారని సంచలన వ్యాఖ్యలు ( Sensational Comments) చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం కింద రైతులకు డిజిటల్ పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేసి మహాపాపం చేశారని నాటి వైసీపీ నాయకులపై మండిపడ్డారు. సీబీఐ, సిట్ ఏమీ లేదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదిక వెల్లడించిందని అన్నారు.
బాత్రూములు కడిగే కెమికల్స్‌తో నెయ్యి తయారు చేసి ఆ నెయ్యితో ఐదేళ్లు ప్రసాదం చేసి ప్రజలకు పంపిణీ చేశారని వెల్లడించారు. శ్రీశైలం కూడా కల్తీ జరిగిందని ఆరోపించారు. లడ్డూ తయారీలో కొన్ని కెమికల్ వాడతారని వివరించారు. వెజిటెబుల్ కొవ్వు వాడితే ఎక్కువ రేట్, యానిమల్ కొవ్వు వాడితే తక్కువ రేటుకు దొరికే నెయ్యిని వాడారని అన్నారు.
తిరుమల లడ్డూ విషయాన్ని తానూ మాడ్లావద్దని అనుకున్నానని, కాని వేంకటేశ్వరస్వామి పవిత్రత కోసం ఆలోచించి ఈ విషయాన్ని బయటపెట్టానని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసి తనపై నెపం వేశారని తాను మౌనంగా ఉంటే తిరుమల లడ్డూ కల్తీని తనపై రుద్దేవారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

