వేలేరు, ఏప్రిల్ 22: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నియోజకవర్గ ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా వేలేరులో మండల ఇన్చార్జి ఇట్టబోయిన భూపతిరాజు ఆధ్వర్యంలో వేలేరు, పీచర, మద్దెలగూడెం, సోడషపల్లి, మల్లికుదుర్ల గ్రామాల్లో నిర్వహించిన సభ సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభ ప్రపంచ మేటి సభల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ సభ కు పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం మద్దెలగూడేనికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకుడు హనుమకొండ రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా రాజయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సమావేశంలో ఉమ్మడి మండలం మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, కో ఆప్షన్ మాజీ సభ్యుడు జానీ, మండల కో ఆర్డినేటర్ సురేశ్, మండల ఇన్చార్జిలు మేక సంతోష్, మంద యాదగిరి, వెంకట్‌గౌడ్, బొల్లు చంద్రమౌళి, మండల అధికార ప్రతినిధి రాజు, ప్రభాకర్, పోలు తిరుపతి, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.