ఖిలావరంగల్, ఫిబ్రవరి 16: అల్లుడి హత్య కేసులో పది మందిని మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ మల్లయ్య కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో ఉంటున్న రంగశాయిపేట ఆదర్శనగర్‌కు చెందిన బజ్జూరి రమేశ్ ఈ నెల 13న జరిగిన బొడ్రాయి వేడుకలకు వరంగల్‌కు వచ్చాడు. కుటుంబ గొడవల కారణంగా కూతురు రమ్య తన వద్దే ఉంటున్నది. అయితే, వీరు రంగశాయిపేటకు వచ్చిన విషయం తెలుసుకున్న అల్లుడు శ్రీనివాస్ రాత్రి ఇక్కడకు వచ్చి బైక్‌పై ఇంటి చుట్టూ తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేశాడు.
దీంతో విసుగెత్తిన బజ్జూరి రమేశ్, అతడి కొడుకు అఖిల్, కూతురు రమ్య, భార్య విజయ అతడిపై దాడి చేశారు. శ్రీనివాస్ ప్రతిఘటించడంతో బంధువులు ఆకుతోట అనసూర్య, తోట మల్లికాంబ, అలేఖ్య, సుధాకర్, శేషు, నీరటి సాంబయ్య కారంపొడిని కళ్లలో చల్లి మెడకు తాడు బిగించి రోకలితో తలపై కొట్టారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందా డు. శ్రీనివాస్ తండ్రి దుట్ట వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.