తెలంగాణ దేశానికే రోల్‌మోడల్
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
- అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష
- వచ్చే ఎన్నికల్లోనూ విజయం మనదే
- విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- దేవరుప్పుల, చిన్నమడూరులో జోరుగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు
దేవరుప్పుల, ఏప్రిల్ 4 : తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం దేవరుప్పులలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, మన్‌పహాడ్ గ్రామాల పార్టీ శ్రేణులు, చిన్నమడూరులో జరిగిన కార్యక్రమంలో చిన్నమడూరు, రాంభోజిగూడెం, కోలుకొండ, రామచంద్రాపూర్ గ్రామాల కార్యకర్తలు పాల్గొనగా, మంత్రి ఎర్రబెల్లి, ఉషాదయాకర్‌రావు హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని, ఎన్నికల వరకు కాపాడుకుంటే తిరిగి కేసీఆర్ పాలనే ఉంటుందన్నారు. మనం చేసిన పనిని ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ ఏదో ఒక ప్రభుత్వ పథకం అందుతున్నట్లు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నాయని, ముఖ్యమంత్రి తనకు మంత్రి పదవి ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలను మార్చివేసిందని, ఇప్పుడు ఏ పల్లెకు వెళ్లినా పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చామని, ఇంకా ఏమైనా మిగిలుంటే నెరవేర్చుతాము కానీ, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేదే లేదన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉందన్నారు. ఇది తన నియోజకవర్గం కావడం అదృష్టమన్నారు. భాగవతం రాసిన బొమ్మెర పోతన మనవాడు.. రామాయణం రాసిన వాల్మికి మన వల్మిడి నివాసి.. పాల్కుర్కి సోమనాథడు మనవాడని, ఈ మూడు ప్రదేశాలను కలుపుతూ టూరిజం కారిడార్ చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదన్నారు.
పోతన స్వస్థలం బొమ్మెరను మరో బాసరగా, వాల్మికి నడయాడిన నేల వల్మిడిని దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దుతామన్నారు. కాకతీయుల కాలంనాటి చెన్నూరు త్రికూటాలయాన్ని రూ.4 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కడవెండి వానకొండయ్య గుట్టపైకి రోడ్డు వేస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాన ని, నాయకులకు పదవులిచ్చి సముచిత స్ధానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాలకు ఆపదొస్తే ఆదుకుంటానన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందు కే ఉచిత కుట్టు శిక్షణ తరగతులను ప్రప్రథమంగా రాష్ట్రంలో పాలకుర్తిలోనే ప్రారంభించామని, శిక్షణ పూర్తయిన మహిళలకు టెక్స్టైల్ పార్కుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. సామూహికంగా పరిశ్రమలు పెట్టుకుంటనే రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమాల్లో అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి సుధీర్‌రెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, చామల విక్రంరెడ్డి, పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, వంగ వెంకన్న, ధరావత్ రాంసింగ్, కొల్లూరు సోమయ్య, కోతి ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్ యాకస్వామి, యూత్ మండల అధ్యక్షుడు నవీన్‌నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాచర్ల బాబు, కోతి పద్మ, సర్పంచ్‌లు వంగ పద్మ, కూర్నాల రవి, ఈదునూరి రమాదేవి, సింగిరెడ్డి సరిత, బిళ్ల అంజమ్మ, మధు, ఎంపీటీసీలు గోడుగు సుజాత, తోటకూరి రేణుక, గ్రామాల అధ్యక్షులు జనగాం సంతోశ్, గనుపాక ఎల్లేశ్, మల్లారెడ్డి, మల్లేశ్, లొడంగి వెంకన్న, ఎల్లబోయిన గిరియాదవ్, జోగు వీరస్వామి, ఇన్చార్జిలు ఎడమ నర్సిరెడ్డి, వంగ అర్జున్, గొడుగు మల్లికార్జున్, కంకటి సమ్మయ్య, గజ్జెల భాస్కర్, రాజు, వేణు, ఉపసర్పంచ్ గొడుగు వేణు, కాసీం, మైసారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

