అవతరణ సంబురం.. ఉమ్మడి జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
- ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా కార్యక్రమాలు
- జెండా ఆవిష్కరించిన ముఖ్య అతిథులు
- అమర వీరుల స్తూపాల వద్ద నివాళులు
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
- వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ కోటలోని ఖుష్‌మహల్ మైదానంలో మంత్రి కొండా సురేఖ, ములుగులో మంత్రి సీతక్క, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ విప్‌లు రామచంద్రూనాయక్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రులు సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కాగా, హనుమకొండలో విద్యార్థులు లేకపోవడంతో లష్కర్ బజార్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే నృత్యం చేశారు.
అలాగే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ కార్మిక, ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో వాడవాడలా జెండాలను ఎగురవేశారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకొని, వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలా ఉండగా, వరంగల్‌లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలకు నిరసన సెగ తాకింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర సాధన కోసం శ్రమించిన ఉద్యమకారులను ఆవిర్బావ దినోత్సవం రోజు పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

