కాంగ్రెస్, బీజేపీల మోసాలపై చర్చ పెట్టాలి
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు చేసిన మోసాలపై ఇంటింటికి వెళ్లి చర్చ పెట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని అన్నారం షరీఫ్, కల్లెడ, దౌలత్‌నగర్, చింతనెక్కొండ, ఏనుగల్లు, మల్యా తండా, చౌటపెల్లి, సోమా రం, వడ్లకొండ, గోపనపెల్లి, కొంకపాక, పర్వతగిరి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి సమావేశాల్లో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
- తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్ఎస్సే
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ఎమ్మెల్సీ సిరికొండతో కలిసి విస్తృత ప్రచారం
- సుధీర్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు
పర్వతగిరి, మే 6: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు చేసిన మోసాలపై ఇంటింటికి వెళ్లి చర్చ పెట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని అన్నారం షరీఫ్, కల్లెడ, దౌలత్‌నగర్, చింతనెక్కొండ, ఏనుగల్లు, మల్యా తండా, చౌటపెల్లి, సోమా రం, వడ్లకొండ, గోపనపెల్లి, కొంకపాక, పర్వతగిరి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి సమావేశాల్లో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల కు నమ్మకం పోయిందని, తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. కేంద్రంలో చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలైన రుణమాఫీ, రూ. 500 బోనస్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకుని వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎన్నికల సంఘం అనుమతితో రైతు భరోసా, పంట నష్టం, రూ. 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్ ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. పాలన కంటే కు తంత్రాలకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమం లో ఎంపీపీ కమలాపంతులు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జితేందర్‌రెడ్డి, ఎం భిక్షపతి, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యుగేంధర్‌రావు, శ్రీనివాస్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

