ఏసీ గదులకు పరిమితమవుతున్న మంత్రులు
రైతులను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసిందని, తరుగు, తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ప్రభుత్వ పెద్దల అండదండలతో నిలువు దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి అన్నారు.
- రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం
- తరుగు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి
- రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి
- ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా
ములుగు, మే 22 (నమస్తే తెలంగాణ)/ములుగురూరల్ : రైతులను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసిందని, తరుగు, తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ప్రభుత్వ పెద్దల అండదండలతో నిలువు దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ములుగు కలెక్టరేట్ ఎదుట, జాతీయ రహదారిపై రైతుల పక్షాన ధర్నా నిర్వహించి, అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు. ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతితో కలిసి వెంకటాపురం మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పెట్టుబడి సాయం సరిగ్గా అందించకున్నా రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు పండించారని అన్నారు.
ఈ సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన సర్కార్ వారిని గాలికొదిలేసిందన్నారు. తరుగు, తాలు పేరులో క్వింటాలుకు 5 కిలోల నుంచి 8 కిలోల వరకు కట్టింగ్లు పెడు తుండడంతో రైతుల గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. రైతును రాజు చేస్తామని చెప్పిన ప్రభుత్వం చివరికి బికారిని చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కట్టింగ్లలో ఒక లారీకి రూ.20 వేల వరకు ఉంటే, అందులో రూ.10వేలు మంత్రికి వెళ్తున్నాయని ఆరోపించారు. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో 15 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేపట్టాలన్నారు. కొనుగోలు ప్రారంభించి 25 రోజులు దాటినా కేవలం రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. మక్కలు పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రైతుల కష్టాలను పట్టించుకొని పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏసీ గదులకు పరిమితమయ్యారని ఆరోపించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, నాయకులు మల్క రమేశ్, వి. భిక్షపతి, రమణారెడ్డి, జంపన్న, శ్రీనివాస్, సురేశ్, మహేశ్, ఎం. భిక్షపతి, సాగర్, శ్రీనివాస్, జగన్మోహన్రావు, యాదగిరి, వెంకన్న తదితరులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

