జాతీయ మాలమహానాడు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి శ్రీనివాస్
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 6 : ఎస్సీ వర్గీకరణలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చిన 99 జీవో మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, వెంటనే 99 జీవోను వెనక్కి తీసుకోవాలని జాతీయ మాలమహానాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పనికాల శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
99 జీవోలో మాలలకు కేటాయించిన క్రమ సంఖ్య 22 అది కూడా ఉమెన్ క్యాటగిరి కింద ఉందని రిజర్వేషన్లో 20 ఉద్యోగాలు ఉంటే అందులో ఒక్కటి కూడా మాలలకు వచ్చే పరిస్థితి లేదన్నారు. అందులో మాలలకు ఇచ్చిన క్రమసంఖ్య 22ను ఈ రెండిటిని పునఃపరిశీలించి కొత్త రోస్టర్ విధానం తీసుకువచ్చి అందులో మాలలకు క్రమసంఖ్య 20లోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో సూచించిన నిబంధనలకు విరుద్ధంగా తీసుకువచ్చినట్లు, ఈ జీవో రావడానికి కారకులైన తెలంగాణ ఎమ్మెల్యేలందరీ క్యాంపు ఆఫీసులను ముట్టడిస్తామని, 8న పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి క్యాంపు ఆఫీస్ ముట్టడికి వరంగల్ పచ్చిమ నియోజకవర్గంలోని మాల విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని మాల సంఘాల న్యాయకులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మాలల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ఎవరు చూసినా వారిని పాతాళంలో తొక్కడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దళితుల మధ్య వర్గీకరణ చేసి తీరని అన్యాయం చేస్తున్నారని భవిష్యత్తులో ఉపసంహరించుకోకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడితోపాటు అనేక కార్యక్రమాలు రూపొందిస్తామని హెచ్చరించారు.
సమావేశంలో గరిగే ఆనిల్, ఆంకేశ్వరపు రామన్న, కడారి కుమారస్వామి, దండ్రె శ్రీనివాస్, మద్దెల సురేందర్, కాటిక ప్రవీణ్, జగపతి, ఉపిల్ల దయాకర్, ఉదయ్, బొల్లం రాంకుమార్, కునమల్ల అనిలూ, కొరివి అనిల్ పాల్గొన్నారు.