పర్వతగిరి, జూన్ 13: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాటిచెట్టుపై నుంచి గీత కార్మికుడు మడూరి రమేశ్ కాలుజారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో రమేశ్ నడుములో ఎముకలు, పక్క బొక్కలు, కుడి కాలు రెండు భాగాల్లో విరిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్టాపురం ఏకాంతం గౌడ్ శుక్రవారం నాడు ఆస్పత్రికి వెళ్లి మడూరి రమేశ్‌ను పరామర్శించారు.
తీవ్రంగా గాయపడిన రమేశ్‌కు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల వరకు నష్టపరిహారం తక్షణమే అందేలా చూస్తానని ఏకాంతం గౌడ్ హామీ ఇచ్చారు. పూర్తిగా వికలాంగులు అయిన వారికి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కింద రూ.15వేలు అందజేస్తుందని.. అవి కూడా అందేలా చూస్తానని తెలిపారు.