పర్వతగిరి, డిసెంబర్ 29 : విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచేందుకు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా గురువారం పర్వతగిరి ఉ న్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి రమేశ్‌బాబు ఆధ్వర్యంలో సబ్జెక్టుకు ఒకటి చొప్పున 160 రకాల టీఎల్ఎమ్ల (బోధనాభ్యసన సామగ్రి)ను ప్రదర్శించారు. ఈ సం దర్భంగా డీఈవో వాసంతి మాట్లాడుతూ.. బోధనాభ్యసన సామగ్రి వినియోగంతో బోధన సులభతరమవుతుందని, విద్యార్థుల్లో అభ్యసన వేగం పెరుగుతుందన్నారు. నోడల్ అధికారి లింగారెడ్డి మాట్లాడుతూ.. టీఎల్ఎమ్ ప్రదర్శన నిరంతరం కొనసాగాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ ల పంతులు, మాలతి, న్యాయ నిర్ణేతలు ప్రసూన, సాధియా రఫీ, సుమలత, అనిత, శ్రీధర్‌గౌడ్, కిశోర్, చైతన్య, శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎండీ జలీల్, కే హైమావతి, ప్రేమ్ప్రసాద్రావు, ప్రధానోపాధ్యాయులు ఎమ్ శ్రీనివాస్, చంద్రశేఖర్, చంద్రమౌళి, రిసోర్స్ పర్సన్లు కుమార్, కరుణాకర్, ప్రసాద్, నాగేశ్వర్రావు, కరుణ, ఎల్లారాజు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి : టీఎల్ఎం వినియోగంతో విద్యాబోధన సులభతరమని ఎంపీపీ కాట్ల కోమల అన్నారు. గురువారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం మేళాను నోడల్ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 145 రకాల బోధనాభ్యసన సామగ్రి ప్రదర్శించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా విద్యలో వెనుకబడిన వారిని మెరుగుపర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదన్నారు. బోధనాభ్యసన ప్రక్రియలో టీఎల్ఎం వినియోగాన్ని విస్తృతం చేసేందుకు విద్యార్థులను తొలిమెట్టు కార్యక్రమంలో భాగస్వాములను చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఉపాధ్యాయులను జిల్లా స్థాయికి ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంఈవో సత్యనారాయణ, ఎంపీటీసీ రాజు, ఎస్ఎంసీ చైర్మన్ రవి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దాలి..
గీసుగొండ : విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం తొలిమొట్టు కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి కృత్యమేళా జరిగింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన కృత్యాలను ఎంఈవో సత్యనారాయణ, నోడల్ అధికారి బాలకుమార్, సారయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను పాధ్యాయులు బయటకు తీయాలన్నారు. ఉపాధ్యాయులకు కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుననదన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రైవేట్‌కు దీటుగా విద్యార్థులకు విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు రజాక్, సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.