హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 12: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) 2025-26 విద్యాసంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ కోర్సులకు నిర్ణీత ఆలస్య రుసుంతో తత్కాల్ పథకం కింద ప్రవేశ దరఖాస్తులను సమర్పించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ సదానందం తెలిపారు.
ఆలస్య రుసుంతో ఈనెల 15 నుంచి 17 వరకు www.telanganaopenschool.org వెబ్సైట్లో సమర్పించాలన్నారు. దరఖాస్తుదాలందరూ తప్పనిసరిగా సూచించిన సహాయక పత్రాలను సంబంధిత గుర్తింపు పొందిన సంస్థ స్కూల్, కాలేజీకి దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించిన అదేరోజున సమర్పించాలని తెలిపారు.