ధర్మసాగర్, ఏప్రిల్ 7 : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనుపరాతి గుట్టలకు సంబంధించిన రైతుల భూములకు తాను వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో ఉన్న ఏకైక అటవీ సంపదను కాపాడడమే తన లక్ష్యమన్నారు. రెవెన్యూ అధికారులు రైతులకు సంబంధించిన భూములను అటవీ సరిహద్దుకు బయట చూపించాలని, కానీ ఇష్టానుసారంగా అడవి మధ్యలో ఫారెస్టు డిపార్టుమెంట్ వారు ఏర్పాటు చేసిన కందకం బ యట చూపించడం సరికాదని అన్నారు.
నిజమైన రైతులు ఎవరి మాట విని మోసపోవద్దని, వారికి కచ్చితంగా న్యా యం జరుగుతుందన్నారు. రైతుల పక్షాన పోరాడడానికి ప్రతిపక్షంగా తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు. రైతుల పాసుబుక్కులో ఉన్న సర్వే నంబర్ల ఆధారంగా రెవె న్యూ, ఫారెస్టు అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించి అడవి సరిహద్దు గుర్తించి ఏర్పాటు చేసిన ట్రెంచ్ బయట మాత్రమే భూములు చూపించాలని సూచించా రు.
అటవీ శాఖ అధికారుల సర్వే పూర్తయిందని, కానీ ఫైన ల్ రిపోర్ట్ రాలేదని చెప్పినట్లు గుర్తు చేశారు. ఎవరైనా సరే ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన ట్రెంచ్ (కందకం) దాటి లోపలికి వచ్చి భూములు చదును చేయడమేంటనే విషయాన్ని పరిశీలించడానికి వచ్చామని తెలిపారు. కలెక్టర్ ప్రమేయం కూడా ఉందనే విషయం తెలుస్తున్నదని, ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి అటు రైతులకు న్యాయం చేస్తూ, ఇటు అటవీ సంపదను కాపాడాలని కోరుతున్నామని రాజయ్య పేర్కొన్నారు.