స్టేషన్ ఘన్పూర్, జనవరి 27 : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ అంతా అవినీతిమయంగా మారిందని స్టేషన్‌ఘన్‌పూ ర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. మంత్రులందరు కౌంటర్లు తెరిచి నేరుగా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం డివిజన్ కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం ఎదుట రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచిస్తున్నదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లుల కోసం వెళ్తున్న మాజీ ప్రజాప్రతినిధుల నుంచి 12 శాతం వరకు వసూలు చేస్తున్నార ని, ముఖ్యంగా మంత్రి భట్టి విక్రమార్క సతీమణి కౌం టర్ ఏర్పాటు చేసి కమీషన్లు తీసుకుంటున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఇవన్నీ తెలిసినా, ఆయ న కూడా కమీషన్లు తీసుకుంటున్నందువల్లే వారిని అడ్డుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో నిలదీస్తున్న ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయాలని సీఎం చేస్తున్నారన్నారు.
అధికార పార్టీ ఇచ్చిన హా మీలు నెరవేరుస్తూ ప్రజలకు జవాబుదారిగా ఉండాలే తప్ప గూండాగిరీ చేయొద్ద ని రాజయ్య హితవుపలికారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన దేవాదుల పనుల ద్వారానే ప్రస్తుతం నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. కేసీఆర్ హయాంలో రైతు రాజుగా మారగా, కాంగ్రెస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాడన్నారు. హామీలు అమలయ్యే వరకు ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించిన కడియం శ్రీహరికి కేసీఆర్ కుటుంబంపై మాట్లాడే అర్హత లేదన్నారు.
కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ జడ్పీటీసీ రవి, కుడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, మాజీ సర్పంచ్ సురేశ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, ఇనుగాల నర్సింహారెడ్డి, సేవెళ్లి సంపత్, కర్ర సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చందర్‌రెడ్డి, నాయకులు లకావత్ చిరంజీవి, కుంభం కుమార్, బీ శ్రీనివాస్, కుమార్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, జయపాల్ రెడ్డి, నర్సింగం, భూ పతిరా జు, మాచర్ల రఘురాములు, కనకం గణేశ్, నా గపురి పావని, ఎం సునీత, ఉడుమల భాగ్య, హీరాసింగ్, పొన్న రంజిత్, గొడుగు సంజీవ పాల్గొన్నారు.