బచ్చన్నపేట అక్టోబర్ 6 : జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాట చందు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండల బీఆర్ఎస్ ఇన్చార్జులు గద్దల నరసింహారావు, పెద్దిరాజు రెడ్డి చందుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని, ఎంతో మంది కార్యకర్తలు నాయకులు పార్టీ వీడుతున్నారని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊరిలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, సర్పంచుల మాజీ మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షులు చల్లా శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు, సీనియర్ నాయకులు ఈదులకంటి ప్రతాపరెడ్డి, మద్దికుంట రాద, నరేందర్, కనకయ్య, ఫిరోజ్,, సిద్ధారెడ్డి, కిష్టయ్య, అనిల్ రెడ్డి, నరసింహులు, స్వామి, రాజు గౌడ్, శశిధర్ రెడ్డి, వినయ్, ఇంద్రారెడ్డి, శివకుమార్ గౌడ్, శ్రీధర్, ఆజాం, జోగిరెడ్డి, మహేందర్ రెడ్డి, హరి ప్రసాద్, కేకే రాజ్, కరుణాకర్, కనకయ్య, సిద్ధారెడ్డి, చంద్రశేఖర్, కరుణాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, షబ్బీర్, జావేద్, సిద్ధిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.