Lipi Epics app | ఈ రోజు హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో ప్రముఖుల సమక్షంలో ‘లిపి ఎపిక్స్ రామాయణం యాప్’ ఆవిష్కరణ జరిగింది. ఈ సభకు మాశర్మ అధ్యక్షత వహించారు. లిపి ఎపిక్స్ యాప్‌లో మహాభారత, రామాయణాలు కథలు, వీడియోలు, ఆడియోల రూపంలో యువతకు తెలియజేసే ఆలోచనతో సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తయారు చేశామని కంపెనీ సీఈవో విద్యాసాగర్ అనిసింగరాజు తెలియజేశారు.
ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త విఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ.. మహాభారత రామాయణాలు మంచి నడవడిక, వ్యక్తిత్వ వికాసం కోసం అందరూ కచ్చితంగా తెలుసుకోవాలని చెప్పారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. పిల్లల మేధాశక్తి మీద భాష ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచేసి లిపి ఎపిక్స్ ఆప్ ఆటల ద్వారా పిల్లలకు భాష మీద, మన సంస్కృతి మీద పట్టు సాధించేలా చేయవచ్చని చెప్పారు. జ్ఞాపక శక్తి కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆమె స్వయంగా ప్రతిరోజు లిపి యాప్ వాడుతున్నానని.. అందరూ లిపి యాప్‌ను ఉపయోగించుకోవాలని రమా రావి చెప్పారు.
జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. భాష మీద పట్టు ఉంటే మేధస్సు మీద పట్టు ఉంటుందని తెలుగు మీద మమకారాన్ని పెంచుకుంటే మిగిలిన భాషలు బాగా మాట్లాడగలమన్నారు. మహాభారత రామాయణాలు మన దేశ సంస్కృతి అని వాటిని కచ్చితంగా నేర్చుకోవటానికి లిపి ఎపిక్స్ ఆప్ అందరూ వాడాలని.. లిపి ఎపిక్స్ సంస్థని అందరూ ప్రోత్సహించాలని తెలియజేశారు. ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ.. సులభంగా తెలియచేస్తే మన ఇతిహాసాలు అందరికీ అర్థం అవుతాయని లిపి ఎపిక్స్ ని అభినందిస్తూ కచ్చితంగా అందరూ లిపి ఎపిక్స్ యాప్‌ను వాడాలి అని ప్రోత్సహించారు.