Surat | విషవాయువులు పీల్చి సూరత్లో దంపతులు, కుమారుడు మృతి.. ఆత్మహత్యగా అనుమానం
Surat : గుజరాత్లోని సూరత్ పట్టణంలో దారుణం జరిగింది. దంపతులు, వారి కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. ఏదైనా గ్యాస్ లీకై, బయటికి వెళ్లే మార్గం లేక, ఆ గ్యాస్ పీల్చి మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Surat : గుజరాత్లోని సూరత్ పట్టణంలో దారుణం జరిగింది. దంపతులు, వారి కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. విషవాయువులు పీల్చడం కారణంగా వారు మరణించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా.. ఆత్మహత్యా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్, లాల్గేట్ ప్రాంతంలోని హరిపురా పరిధిలో నివాసం ఉండే ఫయాజ్ అహ్మద్ (40), అతడి భార్య ముబీనా (36), వారి కుమారుడు నోమ్నా (12) వారి ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు.
హాల్లోనే ముగ్గురి మృతదేహాలు పడి ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వారు మరణించిన ప్రదేశంలో విష వాయువులు లీకైనట్లు గుర్తించారు. ఈ విషవాయువు కారణంగానే వారు మరణించారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. విష వాయువు పీల్చిన ఆనవాళ్లు కూడా వారి శరీరంపై గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి అడుగుపెట్టేసరికి ఏదో విషవాయువు లీకైన వాసన వచ్చింది. ఏసీ కోసం ఇల్లు పూర్తిగా మూసి ఉండగా, ఏవో గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
దీంతో ఏదైనా గ్యాస్ లీకై, బయటికి వెళ్లే మార్గం లేక, ఆ గ్యాస్ పీల్చి మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, గ్యాస్ లీకేజీ ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుటుంబం ఇటీవలే సౌదీ అరేబియా వెళ్లి ఉమ్రా పూర్తి చేసుకుని వచ్చినట్లు డీసీపీ రాఘవ్ జైన్ తెలిపారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

