హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 20 : జానపద కళతో వరంగల్ జిల్లా కీర్తిని నిలబెట్టిన కునమల్ల శంకర్, దీకొండ సారంగపాణిల వారసత్వ కొనసాగింపులో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అంజలి మీడియా గ్రూప్ సంయుక్తంగా హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించే జానపద జాతరను విజయవంతం చేయాలని ప్రోగ్రాం కోఆర్డినేటర్లు తాళ్ల సునీల్, జూపాక శివ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. శంకర్, సారంగపాణిలతో కలిసి ఆడి-పాడి, పనిచేసిన సహచర బృందంలోని కొంతమంది సీనియర్ కళాకారులకు ఈ కార్యక్రమంలో గౌరవంగా సన్మానించనున్నట్లు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్, కల్చరల్ ఇంచార్జ్ గోల్కొండ బుచ్చన్న, అంజలి మీడియా గ్రూప్ గౌరవ అధ్యక్షుడు ఆకుల సదానందం, కళావారం కన్వీనర్ ఎర్ర ప్రసూన, నాట్యవిభాగం కన్వీనర్ అనిత, సేవా విభాగం కన్వీనర్ రాంప్రసాద్, సాంస్కృతిక శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బాలాజీ, లింగాల ఇమ్మానియేల్, వెన్నెల శ్రీనాథ్, దారా దేవేందర్, కనకం రాజేందర్, రమేష్ శాండిస్, హన్మకొండ బిక్షపతి, ఉప్పరపల్లి రాజు, కొయ్యడ సంధ్య, ఇనుగుర్తి మధు, చైతన్య, మైదం జ్యోత్స్న, పుట్ట జానకి, రహీమ, వేదవతి, రాజేశ్వరి, చిన్న సంధ్య, సంపెట సోమయ్య పాల్గొన్నారు.