హనుమకొండ, జూన్ 16 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన నీట్ -2025 ఫరీక్షా ఫలితాల్లో వరంగల్ ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఈఎస్ఎల్) విద్యార్థులు ప్రతిభ కనబర్చారని అసిస్టెంట్ డైరెక్టర్ సుమన్ కుమార్ తెలిపారు. 133 మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభను చాటుకున్నారని ఆయన వెల్లడించారు. సోమవారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్లోని ఆకాశ్ ఇనిస్టిట్యూట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ గౌడ్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ -2025 పరీక్షా ఫలితాల్లో ఆకాశ్ ఎడ్యుడుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ విద్యార్తులు టాప్ స్కోరర్లుగా నిలిచారన్నారు.
టాప్ 10లో 5గురు, టాప్ 100లో 35 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ అద్భుతమైన ఫలితాలు విద్యార్థుల కృషి, శాస్త్రీయమైన విద్య, పట్టుదల, అలాగే ఎఈఎస్ఎల్ అందించిన ప్రఖ్యాత శిక్షణ, మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఈఎస్ఎల్ చీఫ్ అకడమిక్ అండ్ బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా, బ్రాంచ్ మేనేజర్ రాజేష్, రామకృష్ణ, రవికుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.