నల్లబెల్లి, మే 04 : పార్టీ బలోపేతనే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గంట రవితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నల్లబెల్లి మండలానికి చెందిన పూర్తిస్థాయి బీజేపీ మండల కమిటీని ప్రకటించామన్నారు.
మండల ఉపాధ్యక్షుడిగా గుర్రపు నరేష్, సింగ్గిరెడ్డి యాదగిరి, బత్తిని కుమారస్వామి, భూక్యా మైభూ, ప్రధాన కార్యదర్శులుగా గుగులోతు తిరుపతి, ఈర్ల నాగరాజు, కార్యదర్శులుగా బూర కృష్ణ గౌడ్, మర్రి నాగరాజు, గుంపుల రాజు, పున్నం కృష్ణ మూర్తి, కోశాధికారిగా మురికి మనోహర్ రావు, 23మంది మండల కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశామన్నారు.