హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 10 : ఏప్రిల్ 13న తేదీన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో జరగబోయే భీమ్ దీక్ష ముగింపు సభను విజయవంతం చేయాలని స్వేరో స్టూడెంట్స్యూనియన్(ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట గురువారం ఎస్ఎస్యూ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ దేశచరిత్రలో ప్రజా సంక్షేమానికై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశించిన మార్గంలో పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతామన్నారు. ముగింపు సభకు విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ రాష్ర్ట ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, సాత్విక్, తానేష్, మహేష్, విజయ్, గణేష్, సురేష్, వినయ్, మోజేష్, సతీష్, రాజేష్ పాల్గొన్నారు.