ఖిలావరంగల్, ఏప్రిల్ 29: వేసవిలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ భోగి సువర్ణ అన్నారు. మంగళవారం ఖిలా వరంగల్ మధ్యకోటలో బల్దియా ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటుచేసిన ఒకపూట భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రతిరోజు ఒకపూట భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పారిశుధ్య కార్మికులు ఎండ నుంచి కాపాడుకునేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన టోపీలను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని దూడయ్య, నాయకులు బెడదా వీరన్న, సంగరబోయిన రాజేష్, కిరణ్, గిరి, రాజు, జవాన్లు అఖిల్, శ్యామ్, దశరథ్, కార్మికులు పాల్గొన్నారు.