నల్లబెల్లి : బ్యాటరీలను(Battery theft) అపహరించిన నిందితులను నల్లబెల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో టీఎస్ 24 టి ఏ 13 95 నెంబర్ గల ఆటో మల్లంపల్లి వైపు వెళ్తుండగా పోలీసులను గమనించిన వ్యక్తులు తమ ఆటోను రోడ్డుపై వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంబడించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా 10 సోలార్ బ్యాటరీలను నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల్లో బ్యాటరీలను అపహరించినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
అయితే పర్వతగిరి మండలం (కొంకపాక)బంధంవరం తండాకు చెందిన ఆటో డ్రైవర్ యాకోబుతో పాటు సంగెం మండలం తీగరాజుపల్లెకు చెందిన కర్నె అభిలాష్, ఇదే గ్రామానికి చెందిన గూడూరు అరవింద్, పర్వతగిరి మండలం కొంకపాక గ్రామానికి చెందిన అల్లాడి దుర్గ స్వామిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఎసైఐ తెలిపారు.