హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 29 : మహాత్మా జ్యోతీరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, కాన్షిరాం, బహుజన మహనీయుల జయంతి ఉత్సవాలను సా. 5.30 గంటలకు సమయ్య నగర్ లో నిర్వహిస్తున్నట్లు మహనీయుల జయంతి నిర్వహణ కమిటీ సమ్మయ్యనగర్ కన్వీనర్ జిల్లపల్లి సుధాకర్ తెలిపారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో పోస్టర్లు ఆవిష్కరించారు.
ఆ మహనీయులు సామాజిక న్యాయం, బహుజన రాజ్యాధికారం, కుల నిర్మూలన అనే ఆశయాల కోసం తమ జీవితాలను అంకితం చేశారన్నారు. వారి జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎమ్మెల్సీ ప్రజా గాయకుడు గోరెటి వెంకన్న పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు జిలుకర శ్రీనివాస్, డెంగు దామోదర్, రావుల నరసింహ, జిలుకర స్వామి, రావుల వెంకన్న, గుర్రం బాబు పాల్గొన్నారు.