ఐనవోలు( హనుమకొండ) : విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎంఈవో పులి సదానందం తెలిపారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని జడ్పీ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు దొడ్డ నర్సిరెడ్డి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.80 వేల విలువైన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేశారు. ఈ మేరకు సోమవారం పంథిని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అర్షనపల్లి శ్రీరాంభూపాల్రావుతో కలిసి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన మండలానికి జిల్లా స్థాయిలో మంచి పేరు తీసుకరావాలన్నారు. విలువైన స్టడీ మెటిరియల్ అందజేసిన నర్సిరెడ్డి ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎన్ఆర్ ట్రస్ట్ సమన్వయకర్త కోలా రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.