హనుమకొండ చౌరస్తా : విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ( Scientists ) గా ఎదగాలని రిటైర్డ్ డిప్యూటీ డీఈవో ఆదర్శ లా కాలేజీ ఛైర్మన్ బూర విద్యాసాగర్‌గౌడ్ ( Vidyasagar Goud ) పిలుపునిచ్చారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్(హడుప్సా) ఆధ్వర్యంలో ‘హడుప్సా సైన్స్ కార్నివాల్ ( Science fair )-2025 పేరుతో రెండురోజులపాటు సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఎనర్జీ కన్జర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ట్రనేటివ్స్ టు ప్లాస్టిక్, రిక్రీషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్, సస్టేనబుల్ అగ్రికల్చర్ అనే ఐదు అంశాలకు సంబంధించి 160 ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు. ఈ సందభంగా బూర విద్యాసాగర్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
విద్యార్థులు నిరంతరం అధ్యాయనం చేయాలని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, భవిష్యత్ భారతదేశాన్ని తీర్చిదిద్దేశాస్త్రవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని హడుప్సా సభ్యులకు సూచించారు. కాజీపేట ఎంఈవో బి.మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తరుఫున నిర్వహించే ప్రతి కార్యక్రమంలో హడుప్సా సభ్యత్వ పాఠశాలలు తప్పకుండా పాల్గొనాలని తద్వారా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు అనే భావం లేకుండా అందరం కలిసి విద్యాలక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు.
జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలని, శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. హడుప్సా అధ్యక్షుడు తక్కళ్లపల్లి బుచ్చిబాబు , ముఖ్యసలహాదారు వర్ధమాను జనార్దన్, ప్రధాన కార్యదర్శి ఎం.సంతోష్‌రెడ్డి, కోశాధికారి డి.శంకర్, సలహాదారులు ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, పి.వేణుమాధవరావు, పి.వెంకటరమణ, టి.రాజేశ్వర్‌రావు, ఎం.శివానంద్, జి.సురేశ్, వి.మధుకర్‌రెడ్డి, బి.వెంకట్‌రెడ్డి, ఆర్.నవీన్‌రెడ్డి, వీసీ రామారావు, వై.వెంకటేశ్వర్రావు, ఎం.సంపత్‌రెడ్డి, జేపీ రామచంద్రమూర్తి, కె.వాసుదేవరెడ్డి, ఎస్డి.సర్ఫరాజ్, పి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు.