హనుమకొండ చౌరస్తా, జూలై 4: జూన్ 17న కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ నిర్మాణానికి ఆమోదించిన పాలక మండలి సభ్యుల నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల శవయాత్రను నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలన్నారు. గతంలో కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంపై దృష్టిపెట్టని పాలకమండలి సభ్యులు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్కు యూనివర్సిటీ భూములను అప్పనంగా అప్పజెప్పే విషయంలో ఎందుకు ఇంత ఆతృతగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
కార్యక్రమంలో డీఎస్ఎ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, కో కన్వీనర్ మున్నా గణేశ్, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద శ్రీకాంత్, స్టాలిన్, ఉపాధ్యక్షుడు కల్యాణ్, పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేశ్, ఎస్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, బీఆర్ఎస్వీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ బైరపాక ప్రశాంత్, బీఎస్ఎఫ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కమ్మరపల్లి శివ, ఏఐడీఎస్వో జిల్లా ఉపాధ్యక్షుడు మధు, డీఎస్‌యూ యూనివర్సిటీ కన్వీనర్ అన్నమయ్య, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు సాయి, జశ్వంత్, విద్యార్థి సంఘం నాయకులు రాజు, నరేశ్ సురేశ్, శివ పాల్గొన్నారు.