బంజారాల అభ్యున్నతికి కృషి
బంజారాల అభ్యున్నతికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం యాకుబ్పురలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో సేవాలాల్ 284వ జయంతి వేడుకలను నిర్వహించారు
- సేవాలాల్ చూపిన మార్గం అనుసరణీయం
- సమష్టి కృషితోనే సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు విజయవంతం : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
- యాకుబ్పురలో ఘనంగా సేవాలాల్ జయంతి.. క్యాంపు కార్యాలయంలో పలువురికి సన్మానం
వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 22 : బంజారాల అభ్యున్నతికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం యాకుబ్పురలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో సేవాలాల్ 284వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ చూపిన మార్గం ఆచరణీయమని, దేశం గర్వించదగిన ఆధ్యాత్మికవేత్తలో ఆయన ఒకరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణమన్నారు. అనంతరం బంజారా సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను సన్కానించారు.
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
కరీమాబాద్ : సమష్టిగా పని చేయడం వల్లే ఆజంజాహి మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు విజయవంతం అయ్యాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఇందుకు కృషి చేసిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులను బుధవారం క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

